Saturday, June 23, 2012

పొట్ట తో జత మట్టి తో జత
రెంటి నడుమ కొట్టు మిట్టాడిన కథ

అమ్మ నాన్నల వాత్సల్యం
నీది నాదని తెలియని బాల్యం
ఆట పాటలు నిండిన బాల్యం
మనవ జన్మకిది అమూల్యం

కోరికలతో కుళ్ళిన కాయం
అబద్దాల అంధకార మయం
కామం క్రోధం ద్వేషం భయం
నేటి యువతకిది దౌర్బల్యం

చేసిన తప్పులు తెలిసే వయసు
పశ్చాతాపం విరిసే వయసు
ప్రతి చర్యలో ముసురును కాసు
మానవత్వమిక అశువులు భాసు

ఆశలు తీరు ఆస్తులు పెరుగు
ఐన ఆగదు కాసుల పరుగు
సోమ్మంతా కలుగులో ములుగు
తేలియందోక్కటే కాలం కరుగు

పిల్లల కోసం మనుమల కోసం
చెయ్యక తప్పదు జనాన్ని మోసం
వృద్దాప్యం లో ఉండదు సాయం
ఒక్కరు వెయ్యరు గుప్పెడు గ్రాసం

జీవితమన్నది బుద్బుద ప్రాయం
ఎప్పుడు వదలకు నీతి ధర్మం
చూడుము దేవుని పొరుగు వాడిలో
నడువుము ధన్యుల అడుగు జాడలో