Saturday, October 8, 2011

Computer Artist

సైన్సు మరియు ఆర్ట్స్ రెండు వేరు వేరు అని మనం అనుకుంటాం , చాల సార్లు రెండు ఒకదానికి ఒకటి విరుద్దాలు అనుకుంటాం కానీ సైన్సు లో కళని , కళలో సైన్సు ని చూడగల్గిన వారు .. ప్రకృతికి .. ప్రపంచానికి చాల దగ్గర అవుతారు .. ఈ ప్రపంచం ఎంత వేగంగా కదులుతుందో ముందే తన అనుభవాల లో గ్రహిస్తారు .. కాలం లో మార్పులను చాల దూరం నుండే పసిగడతారు. చరిత్ర నుండి నేర్చుకుంటారు చరిత్ర లో నిలిచిపోతారు.


నేను ఒక వ్యక్తిని చాల ఆలస్యం గా తెలుసు కున్నాను .. రెండు లేదా మూడు వారాలక్రితం... ఒక వ్యక్తీ జీవితం లో జరిగే ప్రతి సంఘటన వెనకాల ఏదో అర్థం ఉంటుందని ఆయన జీవితం చుస్తే తెలుస్తుంది . ఒక మనిషి తన అనుభవాలతో ఎంతో నేర్చుకోగలడు అని తెలుస్తుంది . మనం ఇష్టపడే పని చేస్తే ఎంతటి వింతలు చూడవచ్చో చెబుతుంది . పని మీద శ్రద్ధ , మనమీద నమ్మకం ఉంటె సున్నా నుండి మొదలు పెట్టినా ఎలా గొప్పగా అవగలమో తెలుస్తుంది .


   
మనం ఇప్పుడు ఇంత అందమయిన కంప్యూటర్స్ అందులో చాల అందమైన ఫాంట్స్ colors .. చిన్న సైజు .. చూస్తున్నాం అంటే దానికి కారణం "ఆపిల్"
ఇప్పుడు ఆపిల్ అంటే పండు అని ఎవరు అనుకోరు అంతలా ప్రభావితం చేసింది CEO of Apple Computers "STEAVE  JOBS"


2005 లో Steave Jobs చేసిన ప్రసంగం వింటే తను ఏంటో తెలుస్తుంది ...





మూడు కథలు :


1 . చుక్కలు కలపటం :


నేను నా కాలేజీ నుంచి మధ్యలో బయట పడ్డాను . నేను చాల ఖరీదైన కాలేజీ ఎంచుకోవటం వల్ల మా తల్లిదండ్రులు దాచుకున్నది అంతా tution ఫీ కోసం ఖర్చు ఐపోయింది కానీ మొదటి 6 నెలల్లోనే  నేను చదివే చదువుకి విలువ లేదు అని అర్థం ఐయింది . జీవితం లో ఎం చెయ్యాలో అన్నది మాత్రం తెలియలేదు. దీంతో కాలేజి మానేసాను కానీ నచ్చిన క్లాస్సేస్ కి మాత్రం వెళ్ళేవాడిని . అది నా జీవితం లో తీసుకున్న మంచి నిర్ణయం అని తర్వాత అర్థం అయింది . అప్పుడు అన్ని కష్టాలే . ఒక ఫ్రెండ్ గదిలో నేల మీద పడుకునే వాడిని . coke bottle తిరిగి అమ్మి కడుపు నింపుకునే వాడిని . వారం లో ఒక్క రోజు అన్న మంచి తిండి తినాలి అని 7 km  నడిచి వెళ్లి హరే కృష్ణ గుడికి వెళ్ళేవాడిని . ఈ కష్టాలు అన్ని ఇష్టంగానే పడ్డాను కానీ ఇవే అనుభవం గా తోడు అవుతాయని అప్పుడు నాకు తెలియదు . అదే సమయం లో అక్షరాలని అందంగా రాసే "క్యాలిగ్రఫి" క్లాసులకి వెళ్ళాను . క్యాలిగ్రఫి అంటే అక్షరాల సౌందర్యం . అదెందుకు నేర్చుకున్నానో ఎందుకు ఉపయోగ పడుతుందో నాకే తెలియదు కానీ మనసుకి నచ్చింది నేర్చుకున్నాను . కానీ 10 సంవత్సరాల తర్వాత మొదటి మాకింతోష్ కంప్యూటర్ ని తాయారు చేస్తున్నపుడు అక్కరకి వచ్చింది . మీరు ఇప్పుడు చూస్తున్న ఫాంట్స్ అన్ని ఆ కోర్సు నుండే వచ్చినవి.  నా జీవితం లో కాలేజి మానేయటం ఒక చుక్క .. మధ్యలో కలిగ్రఫి క్లాసులకి వెళ్ళటం ఒక చుక్క .. ఆపిల్ మాక్ తయారి ఒక చుక్క .. కాలేజి లో ఉన్నపుడే ఇలా చుక్కలు అన్ని కలుస్తాయి అని ఉహించుకోవటం కష్టం కానీ ఇప్పుడు ఒక సరి వెన్నక్కి చూసుకుంటే చుక్కలు అన్ని కలసి కనపడతాయి .

"ముందుకు చూస్తూ చుక్కలని కలపలెం , చుక్కలు కలుస్తాయి అన్న నమ్మకం తోనే ముందుకి వెళ్ళాలి .. నమ్మకం ముఖ్యం .. అంతరాత్మ , విధి  , జీవితం   , కర్మ  ఏదో ఒక దానిని నమ్మాలి  ఈ దృక్పదం నన్ను ఎప్పుడు కున్గిపోనివ్వలేదు , ముందుకు  నడిపించింది "



2 . ప్రేమ , నష్టం


నేను అదృష్టవంతుణ్ణి .. ఇష్టమైన పనిని 20 ఏళ్ళకే స్టార్ట్ చేసే అవకాశం దక్కింది . ఆపిల్ కంపెనీ ని మా ఇంటి గ్యరేజి లో స్టార్ట్ చేసాం .. కష్టపడి పని చేసాం .. ఇద్దరితో మొదలు ఐన ఆ కంపెనీ 10 ఏళ్ళలో 4 వేల  మంది ఉద్యోగులతో ,200 కోట్ల డాలర్ ల కంపెనీ గా అయింది .. నాకు 30 ఏళ్ళు వచాయి . మా అద్బుత సృష్టి మాక్ విడుదల అయి ఏడాది అయింది .. నన్ను మా కంపెనీ నుండి తోసేసారు .. నేను రోడ్డున పడ్డాను .. ముప్పయి ఏళ్ళ వయసులో .. నే చేసిందంతా పోయి .. పిచ్చెక్కి పోయింది కానీ నాకు నా పని పట్ల ప్రేమ తగ్గలేదు . మళ్లీ మొదలు పెట్టాను తర్వాత్తర్వాత అర్థం అయింది .. నన్ను కంపెనీ లోంచి తోసేయటం నా జీవితం లో అత్యత్తమ ఘటన అని ! అప్పటికి నెత్తికెక్కిన విజయ భారం తగ్గిపోయింది .. మళ్లీ  మొదటి నుండి నేర్చుకుంటున్న సంతోషం వచ్చింది . నా జీవితం లో అత్యంత సృజనాత్మక ఘట్టం మొదలు అయింది . అయిదేళ్ళలో నెక్స్ట్ , పిక్సర్ అనే కంపెనీ లు మొదలు పెట్టాను .. ఒక మహిళతో ప్రేమలో పడ్డాను . పిక్సర్ ప్రపంచం లోనే మంచి ,అత్యత్తమ కంపెనీ అయింది . మొదటి అనిమేషన్ సినిమా "టోయ్ స్టొరీ " తీసింది . నెక్స్ట్ ను ఆపిల్ కొనుక్కుంది నేను మళ్లీ ఆపిల్ లోకి వచాను .

"కొన్ని సార్లు జీవితం బరువైన బండలు వేస్తుంది కానీ నమ్మకం పోగొట్టుకోకండి .. నేను పనిని ప్రేమించాను .. ప్రేమించిన పనినే చేశాను .. అదే నన్ను నడిపించింది .. మీరు చేస్తున్నది గొప్ప పని అని నమ్మినపుడే మీరు గొప్ప పని చేయగలరు ."



3 . నా మరణం :


గత ముప్పయి ఏళ్ళనుండి నేను ప్రొద్దునే ఒక ప్రశ్న వేసుకుంటున్నా.. "ఇదే ఆకరి రోజు అయితే నేను చేయాలి అనుకుంటున్నా పని చేస్తానా" సమాధానం కాదు అని వచినపుడల్లా నేను మార్పు కోరుకున్నా.. త్వరలో మరణిస్తాను అని గుర్తుపెట్టుకోవటం .. నా  జీవితం లో  గొప్ప నిర్ణయాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది .. చనిపోతాం అన్నపుడు మనకు ఇతరుల అంచనాలు ..భయం గర్వం ,సిగ్గు ,ఓడిపోతాం  అనే భయం   ఇవేవి ఉండవు ఇప్పుడు కూడా మనసు మాట వినకపోతే ఇంకెందుకు ? .. నాకు కాన్సర్ అని తెలిసిన రోజు డాక్టర్ లు ఇంటికెళ్ళి అన్ని సర్డుకోమన్నారు అప్పటి నుండి చావుకి దగ్గరగానే ఉన్నా ఇప్పుడు ధీమా గా చెబుతున్నా అందరు ఏదో ఒక రోజు చావక తప్పదు .. కొన్నాళ్ళకి మీరు చనిపోతారు.


"మీ సమయం పరిమితం కాబట్టి మీ జీవితం మీరు జీవించండి మరొకరి జీవితాన్ని జీవిన్చొద్దు..ఇతరుల గొంతుల శబ్దాలలో మీ అంతరాత్మ చేసే శబ్దాలను మరిచిపోకండి .. మీ అంతరాత్మ చెప్పినది విని అది చేసే దమ్ము , ధైర్యం తెచ్చుకోండి .. మీరు ఎం కావాలి అనుకున్నారో .. మీ ధైర్యానికి తెలుసు .. ఎప్పుడు ఆకలితో (తపనతో ) ఉండండి ..ఎప్పుడు అమాయకం గా ఉండండి .. విజయానికి ఆ రెండు ముఖ్యం "
"Stay Hungry and Stay Foolish"